Vignaeswarudu (విఘ్నేశ్వరుడు)1-24 (CHANDAMAMA Novel)
విఘ్నేశ్వరుని గురించి
ఏపనయినా 'వందే గణపతింభజే..' అని మొదలు పెట్టడం తెలుగువారి అలవాటు. మిగతా దేవుళ్లమాటెలా ఉన్నా వినాయకుడికి మాత్రం దేశ విదేశాల్లో భక్తులు అనేకులు. ఏ దేవుని పూజించినా ముందు గణపతిని మొక్కటం, ఏ పనికైనా ముందు ఆయన్ని ధ్యానించటంపార్వతీ తనయుడివట్ల జనం భయభక్తుల్ని ప్రకటిస్తాయి. వినాయకచవితి వస్తోందంటేనేఉండ్రాళ్లు, మూషిక వాహనుడు, గణపతి నవరాత్రి ఉత్సవాలు, ఘోరెత్తించే వందిళ్లు, చందా వసూళ్లు, నిమజ్జనం మొదలైనవి మనసులో మెదులుతాయి. పిల్లలు, పెద్దలూ అని తేడా లేకుండా అంతా మనసారా కొలిచే దైవం విఘ్నేశ్వరుడు. కథ విని అక్షతలు తలపై చల్లుకుంటే నీలాపనిందలు దూరమవుతాయనీ, ఆయన కరుణాకటాక్షాలవల్ల విఘ్నాలు తగ్గి అన్నింటా విజయమే ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. సరస్వతీదేవికి చెప్పి ఆమె అనుగ్రహాన్ని తమకు ప్రసాదిస్తాడని విద్యార్థులు గణపతిని కొలవటం పరిపాటి. నాట్యమన్నా నంగీతమన్నా శివసుతుని కి ఇష్టమంటారు, ఉండ్రాళ్లంటే ఆయన మరీ మనను వడతాడనేది నర్వ విదితం. పత్రి సేకరణ, పాలవెల్లి అలంకరణలు - చవితిరోజుల్లో వల్లెటూళ్లలో సహజదృశ్యం. పోటాపోటీలుగా విగ్రహాల తయారీ, దబాయించి చందా వసూళ్లు- వినాయకచవితి వచ్చేస్తోందనడానికి పట్టణ ప్రాంతాల్లో సంకేతాలవుతున్నాయి. భుక్తాయాసంతో అవస్థలు పడుతున్న విఘ్నపతిని చూసి చంద్రుడంతటివాడు అపహాస్యం చేసినా, ముల్లోకాల్లోనూ చక్కర్లు కొట్టడానికి గణాధిపతి ఎలుకలాంటి అల్పప్రాణిని వాహనంగా చేసుకున్నా- వినాయకుడు వినాయకుడే; పిల్లలు పెద్దలూ ఆప్యాయంగా మనసారా కొలిచే దేవుడే!
మా మాట
ఎప్పుడూ కొత్తదనం కోరుకునే తెలుగు పాఠకులకు అందుబాటులో లేని, ఒకప్పటి ప్రసిద్ధ రచనలను పరిచయం చేయాలనే మా ప్రయత్నంలో భాగంగా, అనేక జానపద నవలలూ, చారిత్రక నవలలూ, అనువాద నవలలూ, www.MaKathalu.com ద్వారా ప్రచురించడం జరిగింది. విఘ్నేశ్వరుడు (చందమామ నవల) నవలలను ప్రచురించడం మా అదృష్టంగా భావిస్తున్నాము.
పాఠకులకు విన్నపము
విరాళం (DONATION)
మా కథలు ( www.MaKathalu.com ) మరియు (www.AtoZ2512.com) ద్వారా ఎన్నో పిల్లలకు మరియు పెద్దలకు సంబంధించిన అనేక విషయాలు కథల రూపంలో ఉంటాయి. వాటితోపాటు కనుమరుగై పోయిన అనేక పుస్తకాలను మా కథలు వెబ్ సైట్ లో ఉచితంగా ఆన్ లైన్ లో చదవగలరు. ఈ జ్ఞానాన్ని భవిష్య తరాల వారికి అందించటానికి, క్రొత్త సేవలు అందించటానికి మీ సహాయం, ప్రోత్సాహం ఎంతైనా అవసరం. మీరు చేసే చిరు ప్రోత్సాహం (50/-, 100/-, 500/-, 1000/-....) మాకు కొండంత అండ, బలాన్ని ఇస్తుంది.
Payments App:
Google Pay (Tez): +918099099083
PhonePe: +918099099083
Paytm: +918099099083
Bank details
Account Number: 404 101 500 551
IFSC code: ICIC 000 4041
Name: Suragouni SHYAMPRASAD
Note:
విరాళం(Donate) చేసేటప్పుడు ఏమైనా సమస్య వచ్చినా, సలహా, సమాచారం కోసం +918099099083 కి WhatsApp లేదా Call చేయగలరు.
ఇక చదవండి...
Post a Comment