Astadasa Sakthi Peetalu_(DUSSEHRA special ) అష్టాదశ శక్తి పీఠాలు www.MaKathalu.com |
ఆదిపరాశక్తి మాతను ఆరాధించడానికి అనేక దేవాలయాలు పురాణ గాథల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అలాంటి కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. శక్తి పీఠాలు ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. అయితే వాటిలో ప్రధానమైన వాటిని అష్టాదశ శక్తి పీఠాలుగా గుర్తించారు.
పురాణ కథనం
శక్తి పీఠాలకు సంబంధించి ఒక
పురాణగాథ ప్రచారంలో ఉంది. దక్షుడు యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు. తన
కూతురు, అల్లుడిని
మాత్రం పిలవలేదు, పుట్టింటివారు
ప్రత్యేకంగా పిలవకపోయినా పట్టించుకోకూడదు, వెళ్లితీరవలసిందే అని సతీదేవి
అభిప్రాయపడింది శివుడు వారించినా వినకుండా యాగానికి వెళ్ళింది. శివుడు చెప్పినట్టే
అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో దూకి
భస్మమైంది. అది తెలుసుకున్న శివుడు ఆగ్రహించి తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.
అయినా సతీ వియోగ బాధను తట్టుకోలేని శివుడు ఆమె మృతశరీరంతోనే ఉండి జగత్తును పాలించే కార్యాన్ని మరచిపోయాడు. దేవతలు ఈ విషయం గురించి విష్ణువుకు విన్నవించుకున్నారు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ముక్కలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలే శక్తి పీఠాలుగా ప్రచూర్యం పొందాయి.
హిందువులు పార్వతీ దేవిని
ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని ప్రాంతాలను 'శక్తి
పీఠాలు' అంటారు.
ఈ శక్తి పీఠాలు ఏవి,
ఎన్ని అనే విషయాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెబుతారు. కొంత మంది 18 అనీ, 51 అనీ, మరి
కొందరైతే 52 అనీ, 108
అనీ ఎవరికి తోచింది వారు చెబుతారు. అయితే ఎవరెన్ని చెప్పిన 18 ప్రధానమైన శక్తి
పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారన్నది సత్యం. శివుని అర్ధాంగి సతీదేవి శరీర
భాగాలు పడిన 101 ప్రదేశాలలో 51 క్షేత్రాలు ముఖ్యమైనవి. వాటిలోనూ అతి ముఖ్యమైన శరీర
భాగాలు పడినవి 18 ప్రదేశాలు. వాటినే అష్టాదశ శక్తి పీఠాలుగా గుర్తించి నేడు
పూజిస్తున్నాం. అందులో ఒకటేమో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో (ప్రస్తుతం గుడి ధ్వంసం
అయ్యింది), మరొకటేమో
శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తి పీఠాలు మన ఇండియాలో ఉన్నాయి. తరతరాలుగా
భక్తులు ఆ స్థలాలలో కొలువైవున్న అమ్మవారిని ఆరాధిస్తున్నారు. ప్రతి శక్తి
పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.
108 శక్తి పీఠాలు:
౧. వారణాసిలో విశాలాక్షి
౨. ముఖనివాస౦లో గౌరి
౩. నైవిశ౦లో లి౦గధారిణి
౪. ప్రయాగలో లలిత
౫. గ౦ధమాదన౦ మీద కౌముకి
౬. మానస క్షేత్ర౦లో కుముద
౭. దక్షిణ క్షేత్ర౦లో విశ్వకామ
౮. ఉత్తర క్షేత్ర౦లో విశ్వకామప్రరూపిణీ
౯. గోమ౦త౦లో గోమతి
౧౦. మ౦దర౦లో కామచారిణీ
౧౧. చైత్రరథ౦లో మదోత్కట
౧౨. హస్తినాపుర౦లో జయ౦తి
౧౩. కన్యాకుబ్జ౦లో గౌరి
౧౪. మలయాచల౦పై ర౦భ
౧౫. ఏకామ్ర పీఠ౦లో కీర్తిమతి
౧౬. విశ్వక్షేత్ర౦లో విశ్వేశ్వరి
౧౭. పుష్కర క్షేత్ర౦లో పురుహూతిక
౧౮. కేదార౦లో సన్మార్గదాయిని
౧౯. హిమాలయ౦లో మ౦ద
౨౦. గోకర్ణ౦లో భద్రకర్ణిక
౨౧. స్థానేశ్వర౦లో భవాని
౨౨. బిల్వక్షేత్ర౦లో బిల్వపత్రిక
౨౩. శ్రీశైల౦లో మాధవి
౨౪. భద్రేశ్వర౦ భద్ర
౨౫. వరాహాశైల౦మీద జయ
౨౬. కమలాయ౦లో కమల
౨౭. రుద్రకోటిలో రుద్రాణీ
౨౮. కాల౦జర క్షేత్ర౦లో కాళి
౨౯. శాలగ్రమ౦లో మహాదేవి
౩౦. శివలి౦గక్షేత్ర౦లో జలప్రియ
౩౧. మహాలి౦గ౦లో కపిల
౩౨. మాకోట క్షేత్ర౦లో ముకుటేశ్వరి
౩౩. మాయాపురిలో కుమారి
౩౪. స౦తానక్షేత్ర౦లో లలితా౦బిక
౩౫. గయాక్షేత్ర౦లో మ౦గళాదేవి
౩౬. పురుషోత్తమ పుర౦లో విమలాదేవి
౩౭. సహస్రాక్ష౦లో ఉత్పలాక్షి (సిధ్ధ పీఠాలు)
౩౮. హిరణ్యాక్ష౦లో మహోత్పల
౩౯. విశాపా క్షేత్ర౦లో అమోఘాక్షి
౪౦. పు౦డ్రావర్ధన౦లో పాడల
౪౧. సుపార్శ్వ౦లో నారాయణి
౪౨. త్రికూట౦లో రుద్రసు౦దరి
౪౩. విపులక్షేత్ర౦లో విపులాదేవి
౪౪. మలయాచల౦ మీద కళ్యాణి
౪౫. సహ్యాద్రి మీర ఏకవీర
౪౬. హరిశ్చ౦ద్ర క్షేత్ర౦లో చ౦ద్రిక
౪౭. రామతీర్ఠ౦లో రమణ
౪౮. యమునలో మృగావతి
౪౯. కోటతీర్థ౦లో కోటవి
౫౦. మాధవవన౦లో సుగ౦ధ
౫౧. గోదావరిలో త్రిస౦ధ్య
౫౨. గ౦గాతీర౦లో రతిప్రియ
౫౩. శివకు౦డ౦లో శుభాన౦ద
౫౪. దేవికాతట౦లో న౦దినీదేవి
౫౫. ద్వారవతిలో రుక్మిణీ
౫౬. బృ౦దావన౦లో రాధ
౫౭. మధురలో దేవకి
౫౮. పాతాళ౦లో పరమేశ్వరి
౫౯. చిత్రకూట౦లో సీత
౬౦. వి౦ధ్యపర్వత౦పై వి౦ధ్యావాసిని
౬౧. కరవీరదేశ౦లో మహాలక్ష్మి
౬౨. వినాయకక్షేత్ర౦లో ఉమాదేవి
౬౩. వైద్యనాథ౦లో ఆరోగ్య
౬౪. మహాకాళక్షేత్ర౦లో మహేశ్వరి
౬౫. ఉష్ణతీర్థ౦లో అభయ
౬౬. వి౦ధ్యపర్వత సానువుల్లో నిత౦బ
౬౭. మా౦డవ్య౦లో మా౦డవి
౬౮. మహేశ్వరపుర౦లో స్వాహాదేవి
౬౯. ఛాగల౦డభూమిలో ప్రచ౦డ
౭౦. అమరక౦టక౦లో చ౦డిక
౭౧. సోమేశ్వర౦లో వరారోహ
౭౨. ప్రభాసతీర్థ౦లో పుష్కరావతి
౭౩. సరస్వతిలో దేవమాత
౭౪. తట౦లో పారావారాదేవి
౭౫. మహాలయ౦లో మహాభాగ
౭౬. పయోష్ణిలో సి౦గలేశ్వరి
౭౭. కృతశాచ౦లో సి౦హిక
౭౮. కార్తీక౦లో అతిశ౦కరి
౭౯. ఉత్పలావర్తక౦లో లోలాదేవి
౮౦. శోణస౦గమక్షేత్ర౦లో సుభద్ర
౮౧. సిధ్ధవన౦లో లక్ష్మీమాత
౮౨. భరతాశ్రమ౦లో విశ్వముఖి
౮౩. కిష్కి౦ధపర్వత౦పై తారాదేవి
౮౪. దేవదారువన౦లో పుష్టి
౮౫. కాశ్మీర౦లో మేధాదేవి
౮౬. హిమాద్రిలో భీమాదేవి
౮౭. హిమాద్రిలో తుష్టి, విశ్వేశ్వరి
౮౮. కపాలమోచనక్షేత్ర౦లో శుధ్ధి
౮౯. కాయావరోహణ౦లో మాత
౯౦. శ౦ఖోధ్ధార౦లో ధరాదేవి
౯౧. పి౦డాకార౦లో ధృతి
౯౨. చ౦ద్రభాగాతీర్థ౦లో కళాదేవి
౯౩. అచ్ఛోద౦లో శివధారిణీ
౯౪. వేణాక్షేత్ర౦లో అమృతాదేవి
౯౫. బదరీక్షేత్ర౦లో ఊర్వశి
౯౬. ఉత్తరకురుక్షేత్ర౦లో ఔషధి
౯౭. కుశద్వీప౦లో కుశోదక
౯౮. హేమకూట౦లో మన్మధ
౯౯. కుముదక్షేత్ర౦లో సత్యవాదిని
౧౦౦. అశ్వత్థ౦లో వ౦దనీయ
౧౦౧. వైశ్రవణ౦లో నిధి
౧౦౨. వేదవదన౦లో గాయత్రి
౧౦౩. శివసన్నిధిలో పార్వతి
౧౦౪. దేవలోక౦లో ఇ౦ద్రాణి
౧౦౫. బ్రహ్మవదన౦లో సరస్వతి
౧౦౬. సూర్యబి౦బ౦లో ప్రభ
౧౦౭. మాతలలో వైష్ణవీమాత
౧౦౮. సతులలో అరు౦ధతి
౧౦౯. స్త్రీలలో తిలోత్తమ
౧౧౦. చిత్త౦లో బ్రహ్మకళ
౧౧౧. శరీరధారులలో శక్తిరూపిణీ
౧౧౨. సతీదేవి అ౦గభూతాలు
శక్తిపీఠాలకు సంబంధించి ఈ శ్లోకాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు.
లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం
విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని
యోగినామపి దుర్లభమ్
సాయంకాలే
పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్
శాంకరి
అష్టాదశ
శక్తిపీఠాల్లో శాంకరీదేవి శక్తిపీఠం మొదటిది. ఈ శక్తిపీఠాన్ని పురాణాల్లో
సింహళద్వీపం అని పేర్కొన్నారు. దానినే ఇప్పుడు శ్రీలంక అని వ్యవహరిస్తాన్నారు.
మహర్షులు శాంకరీ దేవిని వనశంకరి అని కూడా పలిచేవారు. వనం అంటే నీరు, అడవి అని అర్థాలు వస్తాయి. శాంకరీ
దేవి వెలసిన లంక చుట్టూ నీరు ఉంటుంది. ఏ విధంగా చూసినా వన శాంకరీదేవి, లంకా శక్తిపీఠసంస్థితగానే భావించాలి.
ఈ తల్లి రాక్షసగుణాలను సంహరించి, ధర్మాన్ని రక్షిస్తూ భక్తులను పాలించేది. మహావిష్ణువు
సతీదేవి శరీరాన్ని ఖండాలుగా చేసిన సమయంలో ఆమె కాలిగజైలు శ్రీలంక ద్వీపంలోని తూర్పు
తీరప్రాంతంలో ట్రింకోమలిపురలో పడ్డాయని పురాణ కథనం. దీంతో ఇక్కడ శాంకరీదేవి
ఆలయాన్ని కట్టారని పూర్వీకులు చెబుతారు. కాగా ప్రస్తుత కాలంలో ఈ శక్తి పీఠం
శిధిలమైపోయింది. ఆ ప్రాంతంలో ఒకనాడు శక్తిపీఠం ఉంది అనడానికి ఆనవాలుగా ఓ స్తంబం మాత్రమే దర్శనం ఇస్తుంది. పదిహేడవ
శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం ధంసమయ్యిందంటారు. శాంకరీదేవి ఆలయ
దర్శనం కాకపోయినా, క్షేత్రమహాత్యం, క్షేత్ర దర్శనం పుణ్యఫలదాయకమే.
కామాక్షి
పార్వతిదేవి
కంచి పట్టణంలో కామాక్షిగా పూజలు అందుకుంటోంది. ఆదిశంకరులు ఈ అమ్మవారికి పూజలు
చేసినట్లు పురాణ కథనం. అమ్మవారు ఇక్కడ యోగముద్రలో పద్మాసనంపై ఆసీనురాలై ఉంటుంది.
శాంతిని, సౌభ్రాతృత్వాన్ని
వెల్లివిరిస్తూ దర్శనమిచ్చే కామాక్షి అమ్మవారు క్రింది హస్తాలతో చెరకుగడ, తామర పుష్పం, చిలుక, పై చేతులతో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటుంది. ఇక్కడ
అమ్మవారు శక్తి అంతా గ్రహించి మన్మధునిలో ఆవహింపజేసిందట, మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఉండడం వలన
సృష్టిలో ఉండే అన్ని శక్తుల మీద తన ప్రభావం చూపుతుందట. కామాక్షి అమ్మవారు మామిడి
చెట్టు క్రింద మట్టితో శివలింగంన్ని ప్రతిష్టచేసి ఈశ్వరుని పాణి గ్రహణం చేసిందని
చెబుతారు. ఇక్కడ అమ్మవారు చాల ఉగ్రతతో ఉంటే ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత
తగ్గించే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శ్రీచక్రానికే పూజలు జరుగుతాయి. ఇక్కడ
ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవ మూర్తిని మేలుకొలిపి, ప్రాతఃకాల నైవేద్యం సమర్పించి
హారతి ఇచ్చి, కామాక్షిదేవి
ఉత్సవ మూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొని వెళ్తారు. ఆతర్వాత గోపృష్ట
భాగం అమ్మవారి వైపు ఉంచి గోపూజ చేస్తారు. అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర
తొలిగించి హారతియిస్తారు. అప్పుడు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు.
శ్రీకామాక్షిదేవి ఆలయానికి ప్రాతఃకాలం 5 గంటలకే వెళ్తే గోపూజ చూడవచ్చు. ఇది తమిళనాడు కాంచీపురంలో
ఉంటుంది. చెన్నై నగరానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
శృంఖలాదేవి
ఈ
క్షేత్రానికి సంబంధించి ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో రుష్యశృంగ మహరి
సతీసమేతుడై దేవిని చాలాకాలం ఉపాసించాడు. శృంఖలాదేవి దివ్యశక్తి రుష్యశృంగ మహర్షిలో
ఉంది. మహర్షి శృంగగిరి శిఖరపై తపస్సు చేసి ఆత్మానందం పొందాడు. తరువాత ఆ శృంగగిరి
ప్రాంతంలో కొన్ని శక్తి క్షేత్రాలను ఏర్పరచి వాటిలో శృంఖలాదేవి శక్తిని భాగాలుగా
స్థాపించాడు. శృంగ మహర్షి స్థాపించిన దేవతలు కనుక సాధకులు ఆ దేవతలను శృంఖలా .
దేవతలుగా పిలిచారు. కలియుగంలో ఆదిశంకరాచార్యులు శారదాదేవి విగ్రహాన్ని మహిష్మతీ
నగరం నుండి తీసుకొని వస్తూ శృంగగిరి ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ అమ్మ
శక్తితరంగాలకు లోనవుతాడు. ప్రదుమ్నం పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ ప్రాంతమని పండితుల
అభిప్రాయం. కాని పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ గాను బెంగాల్ గాను విడిపోయింది. ఇక్కడ
రెండు ప్రాంతాలలోనూ శృంఖలాదేవి క్షేత్రం ఎక్కడా కనపడదు. శృంఖలాదేవి క్షేత్రంపై
భిన్నాభిప్రాయలున్నాయి. ప్రస్తుతం బెంగాల్ లోని ప్రద్యమ్నంలోని అమ్మవారి ఆలయాన్ని
శక్తి పీఠంగా కొలుస్తున్నారు. కలకత్తా సమీపాన గల సాగరసంగమంలో గంగానది ప్రవేశించే
గంగాసాగర్ లో ఉన్న అధినాధ క్షేత్రమే శృంఖలాదేవి శక్తిపీఠమని కొందరి అభిప్రాయం.
చాముండి
చాముండేశ్వరి
దేవాలయం కర్నాటక రాష్ట్రంలోని మైసూరుకు సమీపంలోని కొండపై ఉంది. ఇక్కడ చాముండేశ్వరీ
దేవి ఉగ్రరూపంతో దర్శనమిస్తుంది. మైసూరు మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను
పూజిస్తూ, ఆలయాన్ని
అభివృద్ధి చేశారు. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని సకలాభరణాలతో అలంకరిస్తారు.
సంవత్సరానికి ఒక్కసారి సర్వాలంకార భూషితమైన అమ్మవారి దర్శనం అదృష్టంగా భావిస్తారు.
ఈ సందర్భంగా సర్వశోభితంగా అలరారే అమ్మవారిని చూసి తరిస్తారు భక్తులు.
జోగులాంబ
తెలంగాణ
రాష్ట్రంలోని ఆలంపూర్ లో అమ్మవారు జోగులాంబగా భక్తులచే పూజలందుకుంటోంది. ఇది
కర్నూలు నుండి దాదాపు 27 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర, కృష్ణా నదులు కలిసే స్థలంలో ఉంది. ఆగ్నేయదిశగా నెలకొని ఉన్న
ఈ ఆలయం 14వ
శతాబ్దంలో ధ్వంసం అయింది. అప్పుడు జోగులాంబ, చండి, ముండి విగ్రహాలను బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో భద్రపర్చారు. ఆ
తర్వాత జోగులాంబ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించి అమ్మవారిని ఇక్కడకు తరలించారు.
ఇది అషాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠంగా అలరారుతోంది. అమ్మవారి పై దవడ పంటితో
ఇక్కడ పడినట్టు పురాణకథనం.
భ్రమరాంబిక
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో భ్రమరాంబిక దేవి కొలువుదీరింది. కృష్ణా నదీ తీరాన అమ్మవారు
మల్లికార్జునస్వామి సమేతురాలై భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. అష్టాదశ
శక్తి పీఠాలలో ఇది ఆరవది. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి
ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలను సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు
అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి. అందుకే ఆ తల్లిని భ్రమరాంభ అని
పిలుచుకుంటారు.
మహాలక్ష్మి
మహారాష్ట్రలోని
కొల్లాపూర్ లో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం మణిశిలతో
రూపొందించారు. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంటుంది. ప్రతి ఏడాది మూడు
సార్లు అమ్మవారి పాదాలపై సూర్య కిరణాలు పడడం విశేషం. ఇక్కడ మహాలక్ష్మిని ప్రేమగా
అంబాబాయి అనికూడా పిలుస్తారు, ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని
సందర్శిస్తారు. ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు 8వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని స్థలపురాణం
చెబుతోంది. నవరాత్రి సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు
తండోపతండాలుగా వస్తారు. ఇక్కడ అమ్మవారికి రోజు అయిదు సార్లు అర్చన జరుగుతుంది.
ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో
పాటుగా నవరాత్రులపుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు. ప్రతి శుక్రవారం సాయంత్రాలలో, పౌర్ణమి నాడు, అమ్మవారిని ఆలయం వెలుపల
ఊరేగిస్తారు.
ఏకవీరిక
నాందేడ్
జిల్లా, మహారాష్ట్రలోని
నాందేడ్ జిల్లా మాహుర్యంలో ఏకవీరిక అమ్మవారి క్షేత్రం ఉంది. ఈ ప్రాంతాన్ని మహార్
అని కూడా అంటారు. ఈ అమ్మవారిని రేణుకామాతగా కూడా కొలుస్తారు. ఇది నాందేడ్ పటణానికి
125 కి.మీ
దూరంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి కుడి చేయి పడిందని చెబుతారు.
మహాకాళి
ఉజ్జయిని, మధ్య ప్రదేశ్. ఇదే ఒకప్పుడు అవంతీ
నగరంగా భాసిల్లింది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను
ప్రసాదించిన అమ్మవారు ఈ మహాకాళియే. ఇది సతీదేవి పై పెదవి పడిన స్థలంగా దేవిభాగవతం
చెబుతుంది. పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధం చేస్తున్న
సందర్భంగా అమ్మవారు కాళికాదేవి అవతారం దాల్చి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి
రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం.
పురుహూతిక
ఈ
ఆలయం ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో అలరారుతోంది. ఆంధ్ర ప్రదేశ్ కుకుటేశ్వర స్వామి
సమేతయై అమ్మవారు ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తోంది. ఈ పీఠం మూలంగానే ఈ ఊరికి
పిఠాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఇంద్రుడు ఈ దేవిని ఆ పూజించి తనకున్న ఓ శాపం
నుండి విముక్తి పొందాడని స్థల పురాణం ద్వారా తెలస్తోంది.
గిరిజ
నేటి
ఒరిస్సా రాష్ట్రంలో కటక్ సమీపంలోని వైతరణీనది ఒడ్డున అమ్మవారు త్రిశక్తి
స్వరూపిణిగా వెలసింది. ఈ ప్రాంతాన్ని వైతరణీ పురం అని కూడా అంటారు. ఒరిస్సాలోని
జాజిపూర్ రోడ్ నుండి 20
కి.మీ దూరం ప్రయాణిస్తే గిరిజాదేవి (ఇక్కడ భిరిజాదేవిగా ప్రసిద్ధి) ఆలయానికి
చేరుకోవచ్చు. సతీదేవి నాభి స్థానం ఇక్కడ పడిందని అంటారు. అమ్మవారి ముఖం
మాత్రమే కనిపించేలా మిగితా విగ్రహాన్ని పూలతో, దండలతో, బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు.
మాణిక్యాంబ
ఈ
తల్లి కొలువుదీరిన ప్రదేశాన్ని దక్షవాటిక లేదా ద్రాక్షారామం అంటారు. ఇది ఆంధ్ర
ప్రదేశ్ లో ఉంది. కాకినాడ నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మాణిక్యాంబ ద్రాక్షారామంలో
పరమేశ్వరుడి ఆత్మలింగ సహితంగా భక్తులకు దర్శనమివ్వడంతో ఈ క్షేత్రానికి ప్రత్యేక
గుర్తింపు లభించింది. దక్షప్రజాపతి యజ్ఞం చేసిన ఈ ప్రదేశమే నేటి ద్రాక్షారామం.
పూర్వం దీనిని దక్షారామం అని పిలిచేవారని, కాలక్రమంలో అది ద్రాక్షారామంగా మారినట్లు చెబుతారు. ఈ క్షేత్రానికి
దక్షిణ కాశీగా, వ్యాస
కాశీగా గుర్తింపు ఉంది.
కామరూప
హరి
క్షేత్రం, అసోంలో
ఉంది. గౌహతి నుండి 18 కిలోమీటర్ల
దూరంలో ఉంటుంది. బ్రహ్మపుత్రా నది తీరంలో ప్రకృతి రమణీయతల మధ్య ఈ మందిరం భక్తులను
ఆకట్టుకుంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు
నిర్వహిస్తారు. ఈ దేవిని త్రిపుర శక్తిదాయినిగా కొలుచుకుంటారు. ఇక్కడ మూడు ప్రధాన
రూపాల్లో ఈ తల్లి దర్శనమిస్తుంది. అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా
రూపం ధరిస్తుంది. ఈ రూపాన్ని పరమేశ్వరుడు కూడా చూడలేడు. ఆనందంగా ఉన్నప్పుడు
సింహవాహినియై దర్శనమిస్తుంది. పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపురసుందరిగా
మారుతుంది. ఇంకా అనేక రూపాలు ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది.
మాధవేశ్వరి
ప్రయాగ
(అలహాబాదు), ఉత్తర
ప్రదేశ్, త్రివేణి సంగమం
సమీపంలో ఉంటుంది. ఈ అమ్మవారిని ఆలోపీ దేవి అని కూడా అంటారు. ఈ శక్తి పీఠంలో
విగ్రహారాధనే ఉండదు. ఇలా విగ్రహారాధన లేని శక్తి పీఠం భారత దేశంలో ఇదొక్కటే. ఇక్కడ
పవిత్ర స్నానాలు చేసి పెద్దలకు శ్రాద్ధకర్మలు కూడా నిర్వహిస్తారు. ఇందుకోసం
దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుండి వేలాది మంది అక్కడికి వెళ్తుంటారు. పన్నెండు
సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళ జరుగుతుంది.
వైష్ణవి
జ్వాలా
క్షేత్రం, కాంగ్రా
వద్ద, హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు.
ఏడు జ్వాలలు పురాతన కాలం నుండి వెలుగుతున్నాయి.
మంగళ గౌరి
గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు. ప్రస్తుత ఆలయం 15వ శతాబ్దానికి చెందినది. ఈ
పుణ్యక్షేత్రం సతీదేవికి అంకితం చేశారు. ఇక్కడ మంగళగౌరిని దయగల దేవతగా పూజిస్తారు.
ఈ తల్లిని దర్శించుకొని తమ కోరికలు విన్నవించుకుంటే అవి తీరుతాయని భక్తులు
విశ్వసిస్తారు. ఈ ఆలయాన్ని కొండపైన తూర్పు ముఖంగా నిర్మించారు. ఈ ఆలయం లో భక్తులు
వెలిగించే దీపాలు అఖండ దీపంలా ప్రకాశిస్తూ ఉంటాయి. గర్భగుడి చక్కగా చెక్కిన పురాతన
శిల్పాలను కలిగి ఉంటుంది.
విశాలాక్షి
వారాణసి, ఉత్తర ప్రదేశ్. ఇక్కడ సతీదేవి
మణికట్టు పడిందని చెబుతారు. విశాలాక్షి దర్శనం నయానందకరం. శుభకరం.
సరస్వతి
Post a Comment