బాల కథా సాహిత్యం |Bala Katha Sahithyam | Children's story literature

బాల సాహిత్యం |Bala Sahithyam |  Children's literature

 కథలంటే ఆసక్తి చూపించని పిల్లలు ఉండకపోవచ్చు. పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేవి ఆట బొమ్మలు, కథల పుస్తకాలే. పాఠ్యపుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా లోకజ్ఞానాన్ని బాల సాహిత్యం అందిస్తుంది. కథలు భాషకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానాన్నే కాక మంచి చెడుల విచక్షణము నేర్పి, బాలల ఊహా ప్రపంచానికి, ఆశలకు ఊపిరి పోస్తాయి. చరిత్ర, సంస్కృతి, కళలు, విజ్ఞానం, మానవ స్వభావం, జీవ జంతుజాలం పట్ల ప్రేమ, ఆరోగ్యం, ప్రకృతి విజ్ఞానం - ఒకటేమిటి బాలల ప్రాథమిక విజ్ఞాన సర్వస్వం బాల సాహిత్యం , మనమంతా అలా ఉత్తమ సాహిత్యాన్ని చదువుకుని వచ్చిన వాళ్ళమే.

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆటబొమ్మలు, కథల పుస్తకాలే. పాఠ్యపుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహాలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి. చరిత్ర, సంస్కృతి, కళలు, సైన్స్, మానవ స్వభావాలు, జంతు స్వభావాలు, ఆరోగ్య సంబంధిత అంశాలు- ఒకటేమిటి ప్రాథమిక విజ్ఞానఖని బాలసాహిత్యం . ఇవాళ కంప్యూటర్, ఇంటర్నెట్, ఆన్ లైన్ గేమ్స్ చిన్నారుల జీవితాలను ఊహించని స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయి. అసలైన బాల్యపు మధురానుభూతులను వారికి దూరం చేస్తున్నాయి.

పిల్లలలో నైతికను, ఆధ్యాత్మికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే కథలు నెరవేర్చేవి. మారిన పరిస్థితులలో ఆ బాధ్యతను బాల సాహిత్యమే నెరవేర్చగలదు.

ఇవి అచ్చంగా మన పిల్లలు రాసిన కథలు, స్వచ్చమైన కథలు. వీటిలో భాషా దోషాలు, పునరుక్తులు, వ్యాకరణ దోషాలు లేదా మనం విన్నవి, చదివినవి ఉండొచ్చు. 

ఏ దేశం, ఏ జాతి బాలల్ని వాళ్ళ సాహిత్యాన్ని పట్టించుకోదో ఆ దేశం, ఆ

జాతి అభివృద్ధిని ఊహించలేం.

పిల్లలు మానసిక, బౌద్ధిక వికాసానికి స్థాయిలో తోడ్పడాల్సిన బాధ్యత పెద్దలుగా మనపైన ఉంది. అందుకు కుటుంబం, పరిసరాలు, పాఠశాలతో పాటు చక్కని సాహిత్యాన్ని వారసత్వంగా అందించాల్ని బాధ్యత మనపైన ఉంది.

బాలల కథలు తెలివిని, సమయస్ఫూర్తిని, విజ్ఞానాన్ని, ఆలోచనల పెంచుతాయి. హాస్య కథలు. సమస్య పరిష్కార కథలు, రాజుల కథలు,

జానపత కథలు, సాహసగాథలు ఇలా వర్గీకరిస్తే చాలా రకాల కథలు మనకు గోచరిస్తాయి. పూర్వం పెద్దలు పిల్లల కొరకు వారి స్థాయికి దిగి కథలు వ్రాయడం ఆనవాయితీ. కాని ప్రస్తుతం పిల్లలే మంచి మంచి కథలు వ్రాసి పిల్లలనే గాకుండా పెద్దలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇది ప్రస్తుతం వచ్చిన మార్పు. చందమామ, బాలమిత్ర వంటి పేరెన్నికగన్న పత్రికలు బాలసాహిత్యంలో కథలకున్న గొప్పదనాన్ని నిన్నటి వరకు చాటి చెప్పాయి. బాల సాహిత్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత పెద్దలపైన, పిల్లలపైన ఉంది. ఇందుకు తల్లిదండ్రులు కూడా సహకరించాలి.-

కథలు పిల్లలు, పెద్దలే గాకుండా అన్నీ వయస్సులవారు చదివి ఆనందింతురు గాక! బాల కథా సాహిత్యం సూర్య చంద్రాదులున్నంత వరకు భూమిపై వెలుగుతుందని ఆశిస్తూ...

-మా కథలు.కామ్(www.MaKathalu.com)


Post a Comment

Previous Post Next Post